ఏకాగ్రతతో చదవాలంటే?!


ఏకాగ్రతతో చదవాలంటే?!
Posted On: Monday,May 15,2017
                    'పోటీ పరీక్షల సమయం దగ్గరపడుతోంది? ఏం చేయాలి? ఉన్న తక్కువ సమయంలోనే ఇంత మెటీరియల్ఎలా చదవాలి? ఈసారికి ఇలా కానిచ్చేసి, మరోసారి ప్రయత్నిద్దాంలే' అనుకునేవారు చాలామంది ఉంటారు. అది పనిలో భాగంగానైనా, లేదా పరీక్షల విషయంలోనైనా అందరికీ ఎదురయ్యే సమస్యే. అయితే, అలాంటి సమయంలోనే కొన్ని ప్రణాళికలు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ముందుగా మన దగ్గర ఉండే మెటీరియల్లో మనకు అవసరమైన విషయాలు ఎంతవరకు ఉన్నాయి అనేదానిపైన స్పష్టతకు రావాలి. అందుకోసం మెటీరియల్కు సంబంధించి కొన్ని ప్రశ్నల జాబితా తయారు చేసుకోవాలి. చదివేటప్పుడు ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ, వాటిని క్లుప్తంగా రాసుకోవాలి. రాసుకోవడం ఎందుకంటే, చదవడం వరకూ బాగానే ఉన్నా, అదంతా గుర్తుండాలంటే రాసుకోవాలి. అందుకే, చదవడం మొదలుపెట్టినప్పుడే ముఖ్యం అనుకున్నవాటిని పెన్నుతో గుర్తిస్తూ లైన్స్గీసుకోవాలి. వీలైతే చిన్నపాటి వ్యాఖ్యలు రాసుకోవాలి. వాటికి సమానమైన బొమ్మలు గీసుకున్నా సరే. మొత్తం చదివాక సూచికలని గమనిస్తే చాలు.. విషయం దాదాపు గుర్తుండిపోతుంది.
సమయంలేదు కుదా అని ఒకేసారి గంటలతరబడి కూర్చుని చదివేయకూడదు. కనీసం అరగంటకోకసారైనా ఐదు నుంచి పదినిమిషాలపాటు విరామం ఇవ్వాలి. సమయంలో కాస్త అటూఇటూ నడవడమో లేక ప్రశాంతంగా సంగీతాన్ని ఆస్వాదించడమో చేయాలి. అలాచేస్తే మానసిక అలసటను దూరం చేయవచ్చు.
చదవాల్సిన మెటీరియల్ను అతిచిన్న విభాగాలుగా విడగొట్టుకోవాలి. అలాచేయడం వల్ల, ఒక్కోదాన్ని ముగించుకుని, పదినిమిషాలపాటు విశ్రాంతి కల్పించుకోవచ్చు. చదువు కోసం ఎన్నిగంటలు కేటాయించినా అలసట అనిపించదు.

చదువుకునే సమయంలో ఏకాగ్రత అవసరం. వీలున్నంత వరకూ అలాంటి సమయంలో అంతరాయం కలిగకుండా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. సెల్ఫోన్‌, టీవీ వంటి ఇతరత్రా ఆటంకాలని పక్కనపెట్టాలి.





Comments

Popular posts from this blog

Depression - How to Tackle it?

Students' Problems and Solutions

Nature of Counselling