డిప్రెషన్
డిప్రెషన్
ప్రజాశక్తిఆరోగ్యం
నేడు ఒత్తిడి అనేది సాధారణ మానసిక రుగ్మతగా మారింది. మూడు వందల మిలియన్లకు పైగా జనాభా దీనితో సతమతమౌతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వయసుల వారూ దీనికి లోనౌతున్నారు. ప్రపంచంలో మనో వైకల్యానికి ఒత్తిడే మూలకారణంగా మారుతోంది. పురుషులు కన్నా అధికంగా మహిళలు ఒత్తిడికి గురౌతున్నారు. మానసిక ఒత్తిడి వల్ల డిప్రెషన్ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు చదువుల ఒత్తిడికారణంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారనిస్పందన మానసిక వైద్యశాల ఎమ్డి, సైక్రియాట్రిస్ట్ డాక్టర్ పి.కృష్ణ మోహన్ తెలిపారు. మానసిక ఒత్తిళ్లు సమస్యలపై ఈ వారం ఆరోగ్యం శీర్షికలో తెలుసుకుందాం...
నేడు ఒత్తిడి అనేది సాధారణ మానసిక రుగ్మతగా మారింది. మూడు వందల మిలియన్లకు పైగా జనాభా దీనితో సతమతమౌతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వయసుల వారూ దీనికి లోనౌతున్నారు. ప్రపంచంలో మనో వైకల్యానికి ఒత్తిడే మూలకారణంగా మారుతోంది. పురుషులు కన్నా అధికంగా మహిళలు ఒత్తిడికి గురౌతున్నారు. మానసిక ఒత్తిడి వల్ల డిప్రెషన్ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు చదువుల ఒత్తిడికారణంగా విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారనిస్పందన మానసిక వైద్యశాల ఎమ్డి, సైక్రియాట్రిస్ట్ డాక్టర్ పి.కృష్ణ మోహన్ తెలిపారు. మానసిక ఒత్తిళ్లు సమస్యలపై ఈ వారం ఆరోగ్యం శీర్షికలో తెలుసుకుందాం...
దైనందిన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మనుగడ కోసం కాలంతో పాటు జనం పోటీపడక తప్పడంలేదు. ఈ ఉరుకులపరుగుల వేగంలో, శరవేగంగా మారుతున్న జీవనశైలిలో మనిషి ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఎదో ఒక స్థాయిలో ఈ మానసిక ఒత్తిడి మనిషిని నిలువునా కృంగదీస్తోంది. తీవ్రమైన న్యూనతాభావంలోకి నెట్టేస్తోంది. అనేకరకాలైన మానసిక సమస్యల వలయంలో చిక్కుకుపోయేలా చేస్తోంది. వైద్య పరిభాషలో డిప్రెషన్ అనేది ఈ మానసిక ఒత్తిడి వల్ల వచ్చే శారీరక రోగాలకు కూడా కారణమౌతొంది.
ఇంటా బయటా సమస్యలు
మెదడులోని రసాయనాలైన న్యూరోట్రాన్స్మీటర్లలోని మార్పులవల్లనే డిప్రెషన్ వస్తుంది. దీని వలన రోగుల మానసిక స్థైర్యం చాలా వరకూ దెబ్బతింటుంది. సరిగ్గా ఆలోచించలేరు. మానసికంగా కుమిలిపోతూ, చావే శరణ్యమని భావిస్తారు. డిప్రెషన్వల్ల శరీర ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అతినిద్ర, నిద్రలేమి రెండింటి వల్ల కూడా బాధపడుతుంటారు. కొంత మందికైతే దీనివల్ల తలనొప్పి, కడుపునొప్పి వస్తుంది. కొందరికి అతిగా ఆకలి కలగటం, మరికొందరికి అసలు ఆకలే కలగకపోవటం వంటి లక్షణాలు కూడా. ఈ సమస్యలు కొంతమందికి కొన్నిగంటల వరకే ఉంటే, మరికొందరికి జీవితాంతం ఉంటాయి. వత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలు, కుటుంబ సమస్యలు దీనికి కారణాలు. ఈ మానసిక సమస్యలకు కొన్ని సార్లు చికిత్స జరిపితే అదుపులోనికి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. మరికొన్ని సందర్భాల్లో పూర్తిగా తగ్గించవచ్చు కూడా. మరి కొన్ని సార్లు కొంతమందిలో ఇది శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది.
డిప్రెషన్కు గురైతే
డిప్రెషన్ తీరుని తెలుసుకోవడానికి కొంతమంది శాస్త్రవేత్తలు మెదడులోని న్యూరోట్రాన్స్మీటర్ అయిన 'సెరటోమిన్' శాతాన్ని పరిశీలించారు. డిప్రెషన్కి గురైన వారిలో ఈ సెరటోమిన్ శాతం చాలా తక్కువగా ఉందని తేలింది. కానీ కొందరిలో రిసెప్పర్లు సరిగ్గా పనిచేయక పోవడంతో కార్టిసాల్ పరిమాణం ఎక్కువై కూడా డిప్రెషన్ బారిన పడుతుంటారు. అందుకు కారణం రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసే కత్రిమమైన ఔషధాలే అని వైద్య పరిశోధకులు భావిస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే డిప్రెషన్, ఇన్ఫ్లమేషన్ రెండూ కవలలు వంటివే. డిప్రెషన్కి గురైన వారి శరీర ఉష్ణోగ్రత ఎక్కువే ఉంటుంది. దీనిని బట్టి వారు దీర్ఘకాలంగా ఇన్ఫ్లమేషన్తో బాధపడుతున్నారని గుర్తించొచ్చు. ఇలాంటి వారిలో మూడొంతుల మంది 'ఆర్టీరియో స్కిలోరిస్' అనే గుండె వ్యాధితో చనిపోతున్నారు, వద్ధుల్లో ఈ సంఖ్యమరీ ఎక్కువగా ఉంటోంది.
డిప్రెషన్ ముదిరితే
తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నవారు తమ జీవితాన్ని అంతం చేసుకోవాలనే విపరీతమైన ప్రవర్తన కలిగి ఉంటుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. సాధారణ పరిభాషలో సూసైడల్ టెండెన్సీ అని వ్యవహరిస్తారు. మనిషి తన జీవితాన్ని అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్ అంటాము. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, దానికోసం చేసే ప్రయత్నాలు ఈ రెండూ కూడా మానసిక ఒత్తిడి వలన వచ్చే వ్యాధుల విభాగంలో అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అంశాలు. వివిధ రకాల సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పరమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్లు డిప్రెషన్ని బాగా ఎక్కువ చేస్తాయి.
సాంఘిక సమస్యలలో ప్రధానమైనవి జాతి వివక్ష, అణచివేతకు గురి కావడం, ఆర్థిక కారణాల్లో ప్రధానమైనవి తమ స్థాయికి మించిన అప్పులు చేయడం, కనీసావసరాలకు కూడా డబ్బు సరిపోకపోవడం, మానసిక కారణాల్లో ప్రధానమైనవి పరీక్షలు, ఎన్నికలు మొదలైన వాటిలో ఓటమి చవి చూడటం, వ్యాపారంలో నష్టపోవడం, ఆత్మీయులు మతి చెందడం, భరించలేని స్థాయిలో అవమానాలకు గురి కావడం, మానసిక వ్యాధులకు సంబంధించి వ్యక్తిత్వ లోపాలు, మద్యపానం మొదలైనవి డిప్రెషన్ పెరగడానికి ముఖ్య కారణాలు.
కౌన్సెలింగ్ తప్పని సరి
తీవ్రమైన డిప్రెషన్తో బాధపడేవారికి తప్పని సరిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. డిప్రెషన్ వల్ల కృంగిపోయిన వ్యక్తిలో అది ఎంత బలీయంగా ఉందో గమనించి దానినుంచి బయటపడేలా చేయాలి. డిప్రెషన్ గురించి ఆయా వ్యక్తులతో చర్చించడం వలన వారిని సరైన ఆలోచనా మార్గంలోకి మళ్లించడానికి వీలు కలుగుతుంది. ఏవైనా వ్యాధుల కారణంగా డిప్రెషన్కు లోనైన వారికి ఆ వ్యాధులకు సంబంధించి చికిత్స చేయడం ద్వారా డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావొచ్చు.
డిప్రెషన్ని తగ్గించుకోవడానికి ......
-డిప్రెషన్కు లోనై చిన్నపాటి విషయాలకే విలువైన జీవితాన్ని బలితీసుకోకుండా ఉండేలా తగిన మానసిక స్థైర్యంతో ఆలోచించాలి.
-డిప్రెషన్ వల్ల ప్రమాదాలు చాలావరకు క్షణికావేశంలోనే జరుగుతుంటాయి అందుకే ముందుగా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి .
-ఇతరులు ఆగ్రహంతో ఉన్నా, మీకు ఆగ్రహం వచ్చినా కొద్దిసేపు మౌనంగా ఉండడం,
కొన్ని నిముషాలపాటు మనసులోనే అంకెలు లెక్కపెట్టడం వంటివి చేయాలి.
-డిప్రెషన్కు లోనౌతున్నామని అన్పిస్తే కడుపునిండా చల్లటి నీరు త్రాగడం అవసరం.
-ఒంటరిగా ఉండకుండా మీకు డిప్రెషన్కు గురిచేసే సమస్యను స్నేహితులతోను, తోబుట్టువులతోను, మీ సన్నిహితులతో పంచుకోవడం.
-తల్లిదండ్రులు కూడా వారి పిల్లల చేసే అకతాయి పనులకు పదే పదే .. అదేపనిగా మంలించడం, ఇతరుల మధ్య ఆ విషయాలు చెప్పి అవమానించకూడదు.
-పిల్లలు పూర్తిగా టీవీలకో , వీడియో గేమ్లకో పరిమితమై ముభావముగా ఉంటే వారిని కాస్తా కుటుంబ వ్యవహారాల్లో బాధ్యులను చేయండి.
-కుటుంబ సభ్యులు ఏవరైనా పరధ్యానంగా ఉండడం, భోజనంపై ఆసక్తి చూపకపోవడం లాంటివి చేస్తుంటే వారిపట్ల జాగ్రత్తలు తీసుకొని సామాజిక పనుల్లో నిమగమయ్యేలా చూడాలి.
-మద్యానికి బానిస అయిన వాళ్ళ, డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళలో కూడా ఆత్మహత్యా స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.
- సమస్యని పరిష్కరించడం ద్వారా, బాధితులకు మనోనిబ్బరం కలిగించడం ద్వారా, మానసిక వ్యాధి నిపుణులను సంప్రదించడం ద్వారా, మనస్తత్వశాస్త్ర నిపుణుడిని సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా డిప్రెషన్ను నివారించ వచ్చు.
-డిప్రెషన్తో బాధపడే వారు కేవలం మందులతోనే కాకుండా ప్రశాంతవాతావరణంలో జీవించడం వల్ల చాలా వరకు ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
-జీవితంతో ఎదురయ్యే ప్రతి సమస్యని భూతద్దంలో చూడకుండా, తేలిగ్గా భావించి దూరం చేసుకోవడంలో స్వీయశక్తి అవసరం.
-మనసులోని దుర్గుణాలని ఎవరికి వారే తుడిచిపెట్టుకుని, మంచికి పునాది వేస్తే డిప్రెషన్ దానికదే దూరమవుతుంది.
Comments
Post a Comment