మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవడం ఎలా?


మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవడం ఎలా? By B N Sharma

మీ మానసిక ఆరోగ్యం అనేది మీ శరీర ఆరోగ్యం వంటిది కాదు. మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుందనేది చూడలేము. దానిని లోపలినుండి అనుభవించాల్సిందే. శరీరానికి గాయం అయితే నఅది తగ్గటం కనపడుతుంది. కాని మానసిక అనారోగ్యం పైకి కనపడేది కాదు. కనుక మీరు మానసిక గాయాలు, వాటి బరువు ఎప్పుడూ మీతోపాటే ఉంచుకోకండి. మీరు వాటిని ఉంచుకుంటే, కొంతకాలం అయ్యే సరికి సమస్యలు మనసులో పేరుకుపోయి డిప్రెషన్ లక్షణాలు మీలో కనపడతాయి. కనుక మీకు మానసిక స్వస్ధత ఉన్నదా? లేదా అని నిర్ణయించేటందుకు మీరే నిర్ణేతలు. మీ స్వభావం ఎటువంటిది, ప్రతి చిన్న దానికి తేలికగా గాయపడటం, దానిని మరచేందుకు అధిక సమయం తీసుకోవడమా? అలాగయితే, మీకు మానసిక నివారణ అవసరం అధికమే. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకొనే మార్గాలు కొన్ని పరిశీలించండి.

 మానసిక ఆరోగ్యం మెరుగుపరచే మార్గాలు మానసిక అనారోగ్యానికి అభధ్రత అనేది మొదటి కారణం. ఇతరులు ఏ ది చెప్పినా సరే తేలికగా గాయపడటం మంచిదికాదు. అది మీ అభధ్రతను సూచిస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే, ఎవరైనా వచ్చి హాస్యానికి నీవు లావు ఎక్కిపోతున్నావు? అన్నారనుకోండి. అది మిమ్మల్ని గాయపరుస్తుంది. అదే మీరు కనుక వారి మాటలు లక్ష్యపెట్టని వారైతే, అసలు పట్టించుకోని వారైతే, ఎవరూ కూడా మీ మనసుకు నొప్పి కలిగించలేరు. పెడచెవిని పెట్టండి - చెపటం తేలికే, సాధనలో కష్టం. మరి మానసిక ఆరోగ్యం పొందాలననుకుంటే ఏది విన్నప్పటికి పట్టించుకోనట్లుండాలి. ఎందరో ఎన్నో వ్యాఖ్యలు చేస్తారు. వాటికి మనం ప్రాధాన్యత ఇస్తే వారికి మనం పవర్ ఇచ్చినట్లవుతుంది. కనుక ఆ పవర్ లేదా ఆధిక్యత మీరే ఉంచుకోండి. మిమ్మల్ని మీరు ప్రపంచంనుండి కాపాడుకోండి. మీలోని లోపాలకు మీరే నవ్వుకోండి - మీరు బట్టతల కలిగివుంటే, మీ స్నేహితులు ఎగతాళి చేస్తే, అవును నాది బట్టతలే అంటూ ఆనందంగా నవ్వేసుకోండి. ఇక మిమ్మల్ని వారు ఏమీ చేయలేరు. ఆపై మిమ్మల్ని ఏమీ చేయలేమనే దానిని వారు తర్వాత గ్రహిస్తారు. అది మీ మనసుకు పట్టకుండా మీకు మీరు ఆనందంగా ఉంటారు. అది ఒక వాస్తవం కూడాను. ఇవ్వటంలో ఆనందం చాలా గొప్పది - ఒక రోగం తర్వాత మీ శారీరక ఆరోగ్య అవసరాలవలెనే, మానసికంగా దెబ్బ తిన్నపుడు కూడా మీకు మానసిక నివారణ అవసరమవుతుంది.
 మరి లోపలినుండి మీరు కుదుటపడటానికిగాను ఏ మాత్రం కల్మషం లేని ఆనందాన్ని మీరు పొందాలి. అయితే, జీవితంలో అన్నిటికి మించిన ఆనందం అంటే....నిస్వార్ధంగా ఏదైనా మరొకరికి ఇవ్వడం. అటువంటపుడు మీరు ఏం చేయాలి? మీ వద్ద వున్న పాత దుస్తులు, బొమ్మలు, పుస్తకాలు వంటి వస్తువులను వాటి అవసరం ఉన్న వారికి ఉదారంగా ఇచ్చేయండి. అంతే, మీకు లోపలినుండి ఉపశమనం కలుగుతుంది. మరో రకంగా మానసిక దెబ్బను ఎదుర్కొనాలంటే, మీరు అందంగా అలంకరించుకొని బయట తిరగండి. ఇక మీకు వచ్చే డిప్రెషన్ కూడా రాకుండా దూరం అయిపోతుంది. మీరు కనుక బాధ పడుతూ, ఏడుస్తూ, ఏ అలంకరణ లేకుండా కూర్చుంటే మీకు మనో వేదన కలిగి మరింత దిగజారిపోయే పరిస్ధితి ఏర్పడుతుంది. కనుక మొదటి చర్యగా అందంగా అలంకరించుకొని గ్రేట్ గా భావిచండి. అది ఒక కొత్త డ్రస్ వేసుకోవటం కావచ్చు లేదా, ఒక నెక్లెస్ కొనుక్కోవటం కావచ్చు. లేదా చివరకు మీ హెయిర్ కటింగ్ చేయించుకోవటం కావచ్చు. గంభీరంగా ముఖం పెట్టి గ్రేట్ ఆచరిస్తే ప్రపంచంలో మీరు మరింత కుంగిపోయినట్లు అనిపించదు.



Comments

Popular posts from this blog

Depression - How to Tackle it?

Students' Problems and Solutions

Nature of Counselling