ఈ చిట్కాలు పాటిస్తే కంటి నిండా కునుకు గ్యారంటీ.Sadguru .


ఈ చిట్కాలు పాటిస్తే కంటి నిండా కునుకు గ్యారంటీ.. అలారం వాడకుండానే నిద్ర కూడా      లేవొచ్చు..                             Sadguru

1) తినడానికి, నిద్రించడానికి తగిన సమయం నిర్ణయించుకోవాలి.. మీరు మాంసాహారం లేదా ఇతర తినుబండారాలు ఏవైనా నిద్రించడానికి కనీసం మూడు లేదా నాలుగు గంటల ముందు తీసుకోవాల్సి ఉంటుంది. నిద్రించే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. అప్పుడు బాగా నిద్ర పడుతుంది.

2)
నిద్రకు ముందు స్నానం చేయాలి.. బాగా నిద్ర రావాలంటే మనం పడుకునే ముందు స్నానం చేయాలి. ఎందుకంటే అది మీ శరీరంలో చాలా మార్పు తెస్తుంది. మీ శరీరంపై మలినాలను తొలగించడమే కాకుండా ఎంతో భారమంతా పోయినట్లు అనిపిస్తుంది. మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. వర్షాకాలం, చలికాలంలో చల్లని నీటితో స్నానం చేసే అలవాటుంటే వాటితోనే చేయండి. లేదంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. వేడి నీటితో మాత్రం స్నానం చేయకండి. తొలుత నిద్ర రాదనిపిస్తుంది. కానీ తొలి అరగంటలోనే అద్భుతంగా నిద్రలోకి జారుకుంటారు. హాయిగా కునుకు తీస్తారు.

 3.
ఒక దీపాన్ని వెలిగించండి.. ఇంకా మీకు నిద్ర బాగా వచ్చేందుకు ఒక దూదితో వత్తులను తయారు చేసి, ఏదో ఒక సేంద్రీయ నూనెను వేసి ఒక దీపాన్ని వెలిగించండి. సేంద్రీయ నూనె అంటే నువ్వులు, అవస గింజలు, వేరుశనగ నూనె, ప్రొద్దుతిరుగుడు గింజల నూనె ఏదైనా నూనెను దీపాన్ని వెలిగించేందుకు వాడొచ్చు. మీరు పడుకునే గదిలో ఒక మూల ఆ దీపాన్ని పెట్టండి. అపుడు మీకు హాయిగా నిద్ర వస్తుంది.

4)
ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించకండి.. ఉత్తర దిక్కున తలచేసి నిద్ర పోవొద్దని చాలా మంది పెద్దలు మనకు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే మాత్రం చాలా మంది కారణం చెప్పరు. ఈరోజు ఆ కారణమేంటో తెలుసుకుందాం. ఉత్తరానికి తలపెట్టి పడుకుంటే రాత్రి వేళలో సమాంతర స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తమంతా మీ మెదడు వైపు జారిపోతుంది. తలలో రక్తప్రసరణ ఎక్కువగా ఉంటే మనం ప్రశాంతంగా నిద్ర పోలేము. మీ తలలో ఏదైనా అంతర్గత సమస్యలుంటే.. ఏదైనా బలహీనంగా ఉంటే, లేదా మీరు వయసు పైబడిన వారు అయితే మీరు నిద్రలోనే మరణించే అవకాశం ఉంది. తలలో హేమరైజ్ జరగొచ్చు. ఎందుకంటే ఎక్కువ రక్తం తలలో ప్రవహిస్తుంది కాబట్టి. మీ రక్తనాళాలు వెంట్రుక వాసి మందంలో ఉంటే అధిక రక్తం ప్రవహించినప్పుడు అది నెట్టినట్టు అవుతుంది. ఇందుకు కారణం ఆకర్షణ శక్తి. మీరు నిలబడిన సమయంలో మాత్రం అది జరగదు. ఎప్పుడైతే మీరు సమాంతర స్థితిలో పడుకుంటే అయస్కాంత శక్తి ఆకర్షిస్తుంది. అది బలంగా రక్తాన్ని మెదడు వైపు పంపిణీ చేస్తుంది. ఇది కేవలం ఉత్తర గోళంలోనే జరుగుతుంది. కాబట్టి ఉత్తర దిక్కు మినహా మరేవైపు అయినా మనం తల చేసి పడుకోవచ్చు. ఇది కేవలం మన దేశంలో మాత్రమే. ఇతర దేశాల్లో ఇలా కాకుండా వేరే దిక్కుల్లో తల చేసి నిద్రించకూడదు. అది ఆయా దేశాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో దక్షిణం వైపు తల చేసి పడుకోకూడదు.

5)
ఒక్కసారి వెనక్కి చూసుకోండి.. మీరు ఎప్పుడైనా మరణించవచ్చు. ఏ వయస్సు వారైనా ఎప్పుడైనా చనిపోవచ్చు. దీన్ని మరణ శయ్య అనుకోండి. మీరు కేవలం ఇంకా ఒక్క క్షణమే బతుకుతారు అని అనుకోండి. అలాంటప్పుడే ఒక్కసారి మీరేమీ చేశారో.. మీరేమి సాధించారో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఈరోజు చేసిన పనులు సరైనవా కాదా ఆలోచించిండి. అవి మన విలువను పెంచేవా కాదా అని గుర్తు చేసుకోండి. ఇలా చేస్తే మీరు ఒక అర్థవంతమైన జీవితాన్ని గడిపిన వారవుతారు.
6)
కూడబెట్టినవన్నీ వదిలేయండి.. మీరు నిద్రించే ముందు ఆఖరి మూడు నిమిషాలు మీరు కూడబెట్టినవి అన్నింటినీ వదిలేయాలి. ఈ శరీరం, మెదడులో ఆలోచనలు, ఇతర విషయాలను వదిలేయండి. చాలా మంది దిండు(పిల్లోను) దాచుకొని నిద్రిస్తుంటారు. వారికి అది చాలా ముఖ్యమైనదిగా భావిస్తుంటారు. ఇదే కాదు ఇంకా మీ బంధాలను కూడా పక్కన పెట్టేయండి. అన్నింటినీ వదిలేసి హాయిగా నిద్రపోండి. మీరు ఆ స్టేజ్ లో నిద్రిస్తే మరింత వెలుగుతో, మరింత శక్తితో, మీ ఊహకందకుండా నిద్ర లేస్తారు.
7. అలారం అస్సలు వాడకండి.. ప్రతిరోజూ మీరు ఏ రకమైన శబ్దాలతో నిద్ర లేస్తారనే విషయం రోజూ పరిస్థితిని, మీ జీవిత పరిస్థితిని ఎన్నో రకాలుగా నిర్ణయిస్తుంది. ఒక్క అలారం గంట మోగడంతో మీరు మేల్కొవడం మీ జీవితాన్ని నడిపేందుకు సరైన పద్ధతి కాదు. మీకు ఒక సహాయం అవసరమైతే మీ శరీరం ఉన్న పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి, మీరు తినే ఆహారం, మీరు చేసే ఆలోచనలు తీరుతెన్నులను బట్టి మీరెంత హుషారుగా మిమ్మల్ని మీరు నడుపుకుంటున్నారో.. మీకు ఎంత నిద్ర కావాలో డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకు మీకు ఎంత నిద్ర కావాలో మీరే నిర్ణయించుకోండి. ఇందుకోసం మీరు కొంచెం తొందరగా నిద్రపోవాలి. అపుడు సహజంగానే మీరు తొందరగా మెలకువ అనేది వస్తుంది.


8
) కుడివైపు తిరిగే లేవాలి.. మన శరీరంలోని అతి ముఖ్యమైన భాగం గుండె అని అందరికీ తెలిసిందే. అది ఒక పంపిణీ కేంద్రం. రక్తాన్ని శరీరమంతంటా సరఫరా చేస్తూ ఉంటుంది. అది జరగకపోతే మీ జీవితం అనేదే ఉండదు. అది ఎడమవైపు నుండి ప్రారంభమవుతుంది. శరీరం విశ్రాంతి సమయంలో ఉన్నప్పుడు జీవక్రియ తక్కువగా ఉంటుంది. మీరు నిద్ర లేచినప్పుడు క్రియ పెరుగుతుంది. అంతేకాదు మనం ఉదయం లేవగానే మన రెండు చేతులను కాస్త రుద్దుకుని కళ్ల మీద పెట్టుకోవాలి. అలా చేస్తే మీ నాడి కేంద్రాలన్నీ మాములు స్థితికి వస్తాయి. వ్యవస్థ కూడా వెంటనే మేల్కొంటుంది. నీరసంగా నిద్ర లేవకూడదన్నదే దీని ఉద్దేశ్యం. అందుకే కుడివైపు తిరిగి నిద్ర లేవండి.



9
) నవ్వుతూ నిద్ర లేవండి.. మనం నిద్ర నుండి లేచినప్పుడు కొంచెం నవ్వాలి. ఎందుకంటే మన దేశంలో ప్రతిరోజూ సుమారు రెండున్నర లక్షల మంది నిద్రలోనే చనిపోతున్నారని ఓ సర్వే వెల్లడించింది. అందుకే మనం ఇంకా బతికి ఉన్నందుకు మనం నిద్రలేచినప్పుడు ఒక చిరునవ్వు నవ్వాలి. వీలైతే పెద్దగా కూడా నవ్వండి.



Comments

Popular posts from this blog

Depression - How to Tackle it?

Students' Problems and Solutions